Maa: అమెరికాలో 'మా' పెద్దలకు చుక్కెదురు!

  • డల్లాస్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
  • హోదా కోసం పోరాడాలని నినాదాలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పెద్దలు అమెరికాలోని డల్లాస్ లో పర్యటిస్తున్న వేళ, ప్రవాస భారతీయుల నుంచి వారికి నిరసన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నటీ నటులు ఎందుకు ఉద్యమించడం లేదని ప్రశ్నించిన ఎన్నారైలు, వారిని నిలదీశారు. 'మా' 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను డల్లాస్ లో నిర్వహించిన వేళ ఈ ఘటన జరిగింది.

చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున వచ్చిన తెలుగువారు, హోదా కోసం ఇండస్ట్రీ పోరాడాలని డిమాండ్ చేశారు. నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలిపారు. తమిళనాడు సినీ పరిశ్రమను చూసి బుద్ధి తెచ్చుకోవాలని, హోదా పోరాటంలో సినీ పరిశ్రమ కలసిరావాలని నినాదాలు చేశారు. హోదా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News