P Ramachandrareddy: మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కన్నుమూత

  • ఈ ఉదయం కన్నుమూసిన రామచంద్రారెడ్డి
  • రెండు రోజుల క్రితం బాత్ రూములో జారిపడిన రెడ్డి
  • స్పీకర్ గా, మంత్రిగా పని చేసిన నేత

రెండు రోజుల క్రితం బాత్ రూములో జారిపడిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.రామచంద్రారెడ్డి ఈ ఉదయం కన్నమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామచంద్రారెడ్డి, 1962లో తొలిసారిగా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆపై 1971, 1983, 1985, 1989 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.

చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా సేవలందించారు. కాగా, రామచంద్రారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన తొలితరం నాయకుడు ఆయనని కొనియాడారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరిపించాలని ఆదేశించారు.

P Ramachandrareddy
Congress
Died
KCR
  • Loading...

More Telugu News