Kaira Advani: తొమ్మిది నెలల వయసులోనే నటన... అసలు పేరు ఆలియా: కైరా అద్వానీ గురించి ఆసక్తికర కబుర్లు

  • 'భరత్ అనే నేను'తో హిట్ కొట్టిన కైరా
  • అసలు పేరును మార్చిన సల్మాన్ ఖాన్
  • ఏదైనా అందంగా కనిపిస్తే సొంతం చేసుకోవాల్సిందే
  • మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పట్టా కూడా

కైరా అద్వానీ... 'భరత్ అనే నేను'తో హిట్ కొట్టిన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. అందంతో పాటు అభినయంతోనూ కట్టిపడేసే ఈ భామ గురించిన కొన్ని ఆసక్తికర కబుర్లివి. కైరా తాతయ్య హమీద్ జాఫ్రీ, అలనాటి నటుడు సయీద్ జాఫ్రిీకి స్వయంగా తమ్ముడు కాగా, చిన్న అమ్మమ్మ ప్రముఖ హిందీ నటుడు అశోక్ కుమార్ పెద్ద కుమార్తె.

కైరా అసలు పేరు ఆలియా అద్వానీ కాగా, తొలి చిత్రం 'పుగ్లీ' షూటింగ్ సమయంలో దాని నిర్మాత సల్మాన్ ఖాన్, పేరును కైరాగా మార్చాడు. తొమ్మిది నెలల వయసులోనే విప్రో వ్యాపార ప్రకటనలో కైరా కనిపించింది. అప్పటి నుంచే తరచూ కెమెరాలను ఫేస్ చేస్తుండటంతో అదే తనకు ప్లస్ పాయింట్ అయిందని ఆనందంగా చెబుతోందీ అందాల ముద్దుగుమ్మ.

ఇక తనకు వ్యాయామ పిచ్చి ఉందని, ఎక్సర్ సైజ్ చేయకుండా ఉండలేనని వెల్లడించింది. అందంగా కనిపించిన ప్రతి వస్తువునూ కొనేసే కైరా, తెలుగులో తొలి చిత్రంలోనే మహేష్ వంటి స్టార్ తో పనిచేసే అవకాశాన్ని పొందడం నమ్మలేకున్నానని అంటోంది. అన్నట్టు కైరాకు మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పట్టా కూడా ఉందండోయ్. డిగ్రీ పొందగానే చదువును ఆపేసి నటనలో శిక్షణ తీసుకుంది కూడా.

Kaira Advani
Tollywood
Bharath Ane Nenu
Mahesh Babu
  • Loading...

More Telugu News