Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ఓ టెర్రరిస్టు: ఆస్ట్రేలియా జర్నలిస్ట్

  • కొత్త వివాదానికి తెరదీసిన డెన్నిస్ ఫ్రీడ్ మన్
  • భారత్, పాక్ మధ్య బంధానికి ప్రమాదమని వ్యాఖ్య
  • క్రికెటర్లపై విమర్శలు చేయడం ఫ్రీడ్ మన్ కు అలవాటే
  • ఫ్రీడ్ మన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న ఫ్యాన్స్

భారత క్రికెటర్, ఇటీవల ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేసిన గౌతమ్ గంభీర్ ఓ ఉగ్రవాదని ఆస్ట్రేలియా జర్నలిస్ట్ డెన్నిస్ ఫ్రీడ్ మన్ సంబోధించి కొత్త వివాదానికి తెరదీశాడు. గత వారంలో గంభీర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ జాతీయులను ఇండియాలో కాలు పెట్టనీయకుండా చేయాలని కోరిన నేపథ్యంలో, గంభీర్ వ్యాఖ్యలపై ఫ్రీడ్ మన్ మండిపడ్డాడు.

ఆయన మాటలు భారత్, పాక్ మధ్య బంధానికి ప్రమాదకారని వ్యాఖ్యానించాడు. ఇక గంభీర్ ను విమర్శించడంపై ఫ్రీడ్ మన్ ను క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. భారత క్రికెటర్లపై వ్యాఖ్యలు చేయడం ఫ్రీడ్ మన్ కు కొత్తేమీ కాదని గుర్తు చేస్తున్నారు. ట్విట్టర్ లో 'నువ్వు చేస్తున్న పనులు మరింత ప్రమాదకరమని' నిప్పులు చెరుగుతున్నారు. భారత్, పాక్ సంబంధాలు మరింతగా చెడిపోవాలని కోరుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారు.

Gautam Gambhir
Dennis Freedom
Cricket
India
Pakistan
Terrorist
  • Loading...

More Telugu News