USA: అమెరికాలో మరో రికార్డు కొట్టిన 'భరత్ అనే నేను'!

  • అమెరికాలో 3 మిలియన్ మార్క్ దాటిన చిత్రం
  • అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన మహేష్ చిత్రం
  • ప్రపంచవ్యాప్తంగా రూ. 161 కోట్ల వసూలు

ఇప్పటికే మహేష్ బాబు నటించిన మిగతా అన్ని చిత్రాల కన్నా అధిక కలెక్షన్లు వసూలు చేసిన 'భరత్ అనే నేను' అమెరికాలో దుమ్ము రేపుతోంది. తాజాగా సినిమా కలెక్షన్లు అమెరికాలో 3 మిలియన్ మార్క్ ను దాటినట్టు నిర్మాత డీవీవీ దానయ్య తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం వెల్లడించారు. అమెరికాలో 3 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మహేష్ బాబు తొలి సినిమా ఇదే.

గతంలో ఆయన నటించిన 'శ్రీమంతుడు' యూఎస్ లో 2.8 మిలియన్ డాలర్లను రాబట్టగా, దాన్ని 'భరత్ అనే నేను' అధిగమించింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం, తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 161.28 కోట్లు రాబట్టిందని, తాను నిజం చెబుతున్నానని నిన్న దానయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మూడు వారాల క్రితం విడుదలైన 'రంగస్థలం' అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లను వసూలు చేయగా, దాన్ని 'భరత్ అనే నేను' ఈ వారంలో అధిగమిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

USA
Bharath Ane Nenu
DVV Danaiah
Collections
  • Error fetching data: Network response was not ok

More Telugu News