Yadadri Bhuvanagiri District: అభిమానులకు నిరాశ... మహేష్ బాబు యాదగిరిగుట్ట పర్యటన వాయిదా!

  • యాదగిరిగుట్ట పర్యటన వాయిదా
  • కారణాలను వెల్లడించని చిత్ర బృందం
  • గుట్టపైకి చేరుకున్న అభిమానులకు నిరాశ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన యాదగిరి గుట్ట పర్యటనను వాయిదా వేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో ఆయన పర్యటన వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నిరాశ చెందారు. తమ అభిమాన నటుడిని చూడాలని ఎంతో ఆశతో గుట్టపైకి చేరుకున్న వందలాది మంది భారీ బైక్ ర్యాలీకి కూడా ఏర్పాట్లు చేశారు.

వాస్తవానికి ఈ ఉదయం 8 గంటల్లోపే మహేష్ బాబు, 'భరత్ అనే నేను' చిత్ర బృందం యాదగిరిగుట్టకు వచ్చి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, మహేష్ పర్యటన వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. ఆయన మరోసారి పర్యటిస్తారని భువనగిరి మహేష్ బాబు ఫ్యాన్స్ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.

Yadadri Bhuvanagiri District
Mahesh Babu
Bharath Ane Nenu
  • Loading...

More Telugu News