kala venkatrao: వైసీపీతో బీజేపీ కలిసిపోయిందన్నది జగమెరిగిన సత్యం: కళా వెంకట్రావు

  • బీజేపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోంది
  • హరిబాబు వాస్తవాలను కప్పి ఉంచుతున్నారు
  • సొంత పార్టీ ఎంపీలనే కేసులతో బెదిరించిన చరిత్ర బీజేపీది

వైసీపీతో బీజేపీ కలిసిపోయిందన్నది జగమెరిగిన సత్యమని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. అసలు ఎన్నికల వ్యూహంపై బీజేపీలో ఇప్పటివరకూ చర్చే జరగలేదని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఈ రోజు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై మంత్రి కళా వెంకట్రావు స్పందిస్తూ... జగన్‌ కేసులో ఈడీ అటాచ్‌మెంట్‌లను వెనక్కి తీసుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని, కంభంపాటి హరిబాబు వాస్తవాలను కప్పి ఉంచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీలనే కేసులతో బెదిరించిన చరిత్ర బీజేపీదని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు.

kala venkatrao
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News