Kodandaram: టీజేఏసీ పదవిని ఈ రోజు నుంచి వదిలేస్తున్నాను: కోదండరామ్‌

  • కొత్త అధ్యక్షుడిని త్వరలో స్టీరింగ్‌ కమిటీ ఎన్నుకుంటుంది
  • రేపు తెలంగాణ జన సమితిలో చేరుతున్నాను
  • 2009 నుంచి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు

టీజేఏసీ ఛైర్మన్‌ పదవిని ఈ రోజు నుంచి వదిలేస్తున్నానని ప్రొ.కోదండరామ్‌ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన కోదండరామ్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని టీజేఏసీ కన్వీనర్‌ రఘుకు అందజేశారు.

ఈ సందర్భంగా కోదండరామ్‌ మీడియాతో మాట్లాడుతూ... రేపు తెలంగాణ జన సమితిలో చేరుతున్నానని, 2009 నుంచి తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తాను రాష్ట్రంలో ఇంతకు ముందు పోషించిన పాత్రను తెలంగాణ జన సమితిలోనూ కొనసాగిస్తానని వ్యాఖ్యానించారు. టీజేఏసీ కొత్త అధ్యక్షుడిని త్వరలో స్టీరింగ్‌ కమిటీ ఎన్నుకుంటుందని తెలిపారు.   

Kodandaram
Telangana
Telangana Jana Samithi
  • Loading...

More Telugu News