governer: గవర్నర్‌కు విశ్వ హిందూ పరిషత్ లేఖ.. టీటీడీ ఛైర్మన్, జేఈవోలను తొలగించాలని డిమాండ్
- టీటీడీ బోర్డును రద్దు చేయాలన్న విశ్వ హిందూ పరిషత్
- దేవాలయాలకు ధార్మిక మండళ్లు ఏర్పాటు చేయాలన్న వీహెచ్‌పీ
- బహిరంగ లేఖలో డిమాండ్లు
దేవాలయాలకు ధార్మిక మండళ్లు ఏర్పాటు చేయాలని హిందూ సంఘాలు చాలా కాలం నుంచి తమ డిమాండ్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) గవర్నర్ నరసింహన్‌కు ఓ బహిరంగ లేఖ రాసి పలు అంశాలను ఆయన ముందు ఉంచింది. టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్, జేఈవో శ్రీనివాసరాజును తొలగించాలని, అలాగే టీటీడీ బోర్డును రద్దు చేయాలని అందులో పేర్కొంది. దేవాలయాలకు ధార్మిక మండళ్లు ఏర్పాటు చేయాలని కోరింది.
కాగా, ఈ రోజు టీటీడీ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.