Uttar Pradesh: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ మంత్రి ఇంటిపై రాళ్లు, టొమాటోలతో దాడి!

  • నిన్న ఓ సభలో పాల్గొన్న మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌
  • రెండు సామాజిక వర్గాలకు ఆగ్రహం తెప్పించేలా వ్యాఖ్యలు
  • బాగా మద్యం తాగుతారన్న మంత్రి

రాజ్‌పుత్, యాదవ సామాజిక వర్గాలకు ఆగ్రహం తెప్పించేలా వ్యాఖ్యానించారంటూ ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌ ఇంటిపై కొందరు ఈ రోజు దాడికి పాల్పడడం కలకలం రేపింది. మంత్రి ఇంటిపై రాళ్లు, టొమాటోలను విసిరేస్తూ వారు ఆందోళన చేశారు. కాగా, నిన్న ఓ సభలో పాల్గొన్న మంత్రి ఓం ప్రకాశ్‌  రాజ్‌పుత్‌లు, యాదవులు బాగా మద్యం తాగుతారని, మద్యం వారికి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తోన్న వ్యాపారమని, అందుకే ఆయా వర్గాల వారికి మద్యం అలవాటు అధికమని అన్నారు.

ఈ అలవాటు ఇతర సామాజిక వర్గాల వారికి కూడా ఉన్నప్పటికీ, వారు మరీ అంతగా మద్యం తాగరని వ్యాఖ్యానించారు. సదరు మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపైనే మండిపడ్డ ఆ సామాజిక వర్గాల వారు కొందరు ఆయన ఇంటిపై దాడి చేశారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News