amit shah: ఇవి ఉత్తర, దక్షిణ భారతీయుల మధ్య జరుగుతున్న ఎన్నికలు: సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

  • మోదీ, అమిత్ షాలు ఉత్తరాదివారు
  • నేను కన్నడ భూమి పుత్రుడిని
  • జైలుకు వెళ్లొచ్చిన యెడ్యూరప్ప మళ్లీ సీఎం కావాలనుకుంటున్నారు

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు ఉత్తరాదికి చెందినవారని... తాను కన్నడిగుడినని, కన్నడ భూమి పుత్రుడినని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉత్తర, దక్షిణ భారతీయుల మధ్య జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా తన ప్రచారంలో ప్రాంతీయ భావజాలాన్ని జొప్పించే ప్రయత్నం చేశారు.

కర్ణాటకలో బీజేపీకి సరైన నాయకులు కూడా లేరని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడి, జైలుకి వెళ్లొచ్చిన యెడ్యూరప్ప మరోసారి సీఎం కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లోకి ఆయన వెళ్లలేక మోదీ, అమిత్ షాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. ఉత్తర కర్ణాటకలో కూడా ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతోనే బాదామిలో పోటీకి నిలబడ్డానని చెప్పారు.

amit shah
yeddyurappa
siddaramaiah
Narendra Modi
karnataka
elections
  • Loading...

More Telugu News