anu kumari: నాలుగేళ్ల బిడ్డకు తల్లి.. ఊరికి పేపర్ కూడా రాదు.. అయినా సివిల్స్ లో రెండో ర్యాంకు సాధించింది!

  • రెండో ప్రయత్నంలో సివిల్స్ క్రాక్ చేసిన అను కుమారి
  • తొలి ప్రయత్నంలో ఒక్క మార్కు తేడాతో ప్రిలిమినరీస్ మిస్
  • రోజుకు 10 నుంచి 12 గంటల ప్రిపరేషన్

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 31 ఏళ్ల అను కుమారి (31) చరిత్ర సృష్టించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షలో రెండో ర్యాంకును కైవసం చేసుకున్నారు. సెకండ్ అటెంప్ట్ లో ఆమె సివిల్స్ కు ఎంపికయ్యారు. తొలి అటెంప్ట్ లో కేవలం ఒక్క మార్కు తేడాతో ప్రిలిమినరీ ఎగ్జామ్ ను కోల్పోయారు.

హర్యానాలోని సోనిపట్ కు చెందిన అను కుమారికి నాలుగేళ్ల వయసున్న బిడ్డ ఉండడం గమనార్హం. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆమె సివిల్స్ ను క్రాక్ చేశారు. ఇంటివద్దే ఉంటూ సివిల్స్ కు ప్రిపేర్ అయిన ఆమె... రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్ మీద దృష్టి సారించేవారు. మరో విషయం ఏమిటంటే ఆమె ఉంటున్న గ్రామానికి వార్తా పత్రికలు కూడా రావు.

 దీంతో సమాచారం కోసం ఆమె ఎక్కువగా ఆన్ లైన్ పైనే ఆధారపడ్డారు. ప్రిపరేషన్ కోసం ఇన్ని గంటల సమయాన్ని ఆమె కేటాయిస్తున్నప్పటికీ... తన కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవారు. ఢిల్లీ యూనివర్శిటీలో ఆమె ఫిజిక్స్ చదివారు. నాగ్ పూర్ లో ఎంబీయే చేశారు. యూపీఎస్సీ ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి. టాప్ 25లో ఎనిమిది మంది మహిళలు చోటు సంపాదించుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News