Kodandaram: టీజేఏసీ ఛైర్మన్‌ పదవికి ఈ రోజు సాయంత్రం కోదండరామ్‌ రాజీనామా

  • ఇటీవల కొత్త పార్టీ పెట్టిన కోదండరామ్‌
  • రేపు సరూర్‌నగర్‌లో పార్టీ ఆవిర్భావ సభ
  • అధ్యక్ష బాధ్యతల స్వీకరణ

తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ అధ్యక్షుడిగా ప్రజా, ఉద్యోగ సంఘాలను ఏకం చేస్తూ కీలక పాత్ర పోషించిన ఆ కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్ కోదండరామ్‌ తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి రాజీనామా చేస్తారు.

ఇటీవల ఆయన తెలంగాణ జన సమితి పేరుతో కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ మైదానంలో ఆ పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఆ పార్టీకి కోదండరామ్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టి, తమ భవిష్యత్‌ కార్యాచరణ, విధివిధానాలను ప్రకటిస్తారు.

Kodandaram
Telangana
Telangana Jana Samithi
  • Loading...

More Telugu News