KTR: కేటీఆర్ ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అన్నీ పరిశీలించాం!: మహేష్ బాబు

  • కేటీఆర్ సినిమా చూస్తున్నారంటేనే టెన్షన్ గా ఉంటుంది
  • సినిమా నచ్చకపోతే బాగోలేదని మొహం మీదే చెప్పేస్తారు
  • 'ఆగడు' సినిమా చూసి.. ఇలాంటివి చేయొద్దని చెప్పేశారు

'భరత్ అనే నేను' సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. సినిమా చాలా బాగా ఉందని కితాబిచ్చారు. ఈ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పలు అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గురించి మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమా చూస్తున్నారంటేనే తనకు టెన్షన్ గా ఉంటుందని... ఎందుకంటే సినిమా బాగుంటేనే బాగుంటుందని చెబుతారని, లేకపోతే అస్సలు చెప్పరని అన్నారు.

 ఒక విషయాన్ని తాను మర్చిపోలేనని... 'ఆగడు' సినిమా చూసిన తర్వాత 'స్టాప్ డూయింగ్ నాన్సెన్స్ లైక్ దిస్' అంటూ క్లియర్ గా చెప్పేశారని... ఆయన అంత నిజాయతీగా మాట్లాడతారని చెప్పారు. దర్శకుడు కొరటాల శివకు పొలిటికల్ నాలెడ్జ్ బాగా ఉందని అన్నారు. కేటీఆర్ బయట ఎలా ఉంటారో చూడాలని, అప్పుడప్పుడు బయట టీషర్ట్ లు కూడా వేసుకుని తిరుగుతారని శివ తనకు చెప్పారని తెలిపారు. ఈ క్యారెక్టర్ చేయడానికి ముందు కేటీఆర్ ఎలా బిహేవ్ చేస్తారో అన్నీ పరిశీలించామని చెప్పారు.

KTR
Mahesh Babu
Koratala Siva
Bharath Ane Nenu
Tollywood
  • Loading...

More Telugu News