Drunk Driving: డ్రంకెన్ డ్రైవ్ లో ఏకంగా 53 కార్లు సీజ్

  • డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు
  • 114 మందిపై కేసు నమోదు.. 60 బైకులు సీజ్
  • మందుతాగి పట్టుబడ్డ పలువురు మహిళలు

డ్రంకెన్ డ్రైవ్ లను నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని తనిఖీలు చేపట్టినా, కేసులు నమోదు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఎప్పుడు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినా మందుబాబులు బాగానే బుక్కవుతూ ఉన్నారు. మందు తాగి కార్లు నడుపుతూ పలువురు మహిళలు కూడా పట్టుబడుతుండటం గమనార్హం.

తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 114 మందిపై కేసు నమోదు చేశారు. 53 కార్లు, 60 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన కార్లలో వెళుతున్న మహిళలు కూడా ఈ సందర్భంగా పట్టుబడ్డారు.

  • Loading...

More Telugu News