Pawan Kalyan: పవన్ ట్వీట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన గల్లా జయదేవ్!

  • పవన్ - గల్లా మధ్య ట్విట్టర్ వార్
  • బ్యాటరీ డౌన్ మాటలు వద్దంటూ గల్లాకు జనసేన చురక
  • తమ బ్యాటరీ ఎప్పుడూ ఫుల్ చార్జింగ్‌తో ఉంటుందన్న జయదే‌వ్

జనసేన తనను ఉద్దేశించి చేసిన ట్వీట్‌కు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లా గల్లా ఒక్కసారి లోక్‌సభలో మాట్లాడి మౌనం పాటిస్తున్నారని, దాని వెనక మర్మమేమిటంటూ జనసేన ట్వీట్ చేసింది. బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి ప్రత్యేక హోదా తెచ్చే మార్గాలను ఆలోచించాలని ఎద్దేవా చేసింది.

జనసేన ట్వీట్‌కు గల్లా వెంటనే స్పందించారు. తాను లోక్‌సభలో సెంచరీ కొట్టానని, గత నాలుగేళ్లలో ఇప్పటి వరకు 100 సార్లు మాట్లాడానని ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మీద, ప్రధానిపైన యుద్ధం చేస్తూనే ఉన్నామని అందులో పేర్కొన్నారు. మరి పవన్ మాత్రం ప్రధానిపై ఎందుకు ఆధారపడుతున్నారో చెప్పాలని, ఇంతకీ ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ బ్యాటరీల గురించి చెప్పాలంటే, అవెప్పుడూ ఫుల్ చార్జింగ్‌తో ఉంటాయని స్పష్టం చేశారు. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని, నిజంగా అలాగే ఉంటాయని చేసిన ట్వీట్ వైరల్ అయింది.  

నిజానికి పవన్-గల్లా మధ్య ఇటీవలే ట్విట్టర్ వార్ మొదలైంది. తొలుత జయదేవ్.. త్వరలో కొత్త సినిమా విడుదల కాబోతోందని, జగన్-పవన్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం ప్రశాంత్ కిశోర్ అని, మోడీ-షా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ చిత్రం విడుదల కాబోతోందని సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా జనసేన శుక్రవారం బ్యాటరీ డౌన్ మాటలు మాట్లాడొద్దని ట్వీట్ చేసింది. దానికి కౌంటర్‌గా గల్లా మళ్లీ ఇలా ఘాటు రిప్లై ఇచ్చారు. 

Pawan Kalyan
Galla Jaydev
Telugudesam
Jana sena
  • Loading...

More Telugu News