Pawan Kalyan: కర్ణాటక ఎన్నికల్లో పవన్ సపోర్ట్ ఆ పార్టీకే.. త్వరలోనే ప్రచారం!

  • ఉత్తర కర్ణాటకలో జేడీఎస్ తరపున ప్రచారం చేయనున్న పవన్
  • కనీసం 18 స్థానాలు గెలుచుకోవాలని కుమారస్వామి లక్ష్యం
  • స్టార్ క్యాంపెయినర్లుగా జాగ్వార్ హీరో నిఖిల్‌, పూజాగాంధీ

కర్ణాటక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన ఏ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారన్నది మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్‌గా మారింది. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆ సస్పెన్స్‌కు తెరదించారు. పవన్ కల్యాణ్ ఉత్తర కర్ణాటకలో జేడీఎస్ తరపున ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తెలుగువారు అత్యధికంగా నివసిస్తుండడమే అందుకు కారణం.

తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలతోపాటు ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు ఎక్కువగా ఇక్కడ నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో పవన్‌తో ప్రచారం చేయించడం ద్వారా వారి ఓట్లను కొల్లగొట్టాలనేది కుమారస్వామి ఆలోచన. ఇక్కడ కనీసం 18 స్థానాలైనా గెలవాలని జేడీఎస్ పట్టుదలగా ఉంది. జేడీఎస్ తరపున ఇప్పటికే హీరోయిన్ పూజాగాంధీ, జాగ్వార్ హీరో నిఖిల్‌లు ప్రచారం చేయనున్నట్టు ప్రకటించారు.

Pawan Kalyan
jana sena
Karnataka
JDS
Kumaraswamy
  • Loading...

More Telugu News