Maharashtra: పుట్టిన మరుక్షణమే ఆధార్... రికార్డు సృష్టించిన పాప!
- మహారాష్ట్రలోని ఖామ్గావ్లో ఘటన
- పాప పుట్టక ముందే ఆధార్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తండ్రి
- పాప పుట్టిన 1.48 నిమిషాల్లోనే ఆధార్ కార్డు జారీ
అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోతోన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఈ క్రమంలో చిన్నారులకు ఆధార్ కార్డు ఇవ్వడానికి ఆధార్ ప్రాధికారత సంస్థ(యూఐడీఏఐ) ఇప్పటికే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డు అందిస్తోంది. కాగా, మహారాష్ట్రలోని ఖామ్గావ్లోని ఓ ఆసుపత్రిలో ఇటీవల పుట్టిన ఓ పాప.. జన్మించిన 1.48 నిమిషాల్లోనే ఆధార్ కార్డు పొంది అతి తక్కువ సమయంలో ఆ కార్డు పొందిన రికార్డు నెలకొల్పింది.
ఆ పాపకు సాచి అని పేరు పెట్టారు. తనకు బిడ్డ పుట్టగానే ఆధార్ కార్డు తీసుకుని రికార్డు నెలకొల్పాలని ముందుగానే నిర్ణయించుకున్న సాచి తండ్రి అందు కోసం తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. తన స్నేహితులతో ఈ విషయం గురించి ముందుగానే చర్చించి ఎట్టకేలకు తన పాప రికార్డు నెలకొల్పేలా చేశాడు.