charan: బోయపాటి మూవీలో పవర్ఫుల్ రోల్ పట్టేసిన సుదీప్

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • విలన్ గా వివేక్ ఒబెరాయ్ 
  • ముఖ్యమైన పాత్రలో సుదీప్       

'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుదీప్ బాగా చేరువయ్యాడు. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న సుదీప్, ప్రస్తుతం 'సైరా' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయనకి చరణ్ సినిమా నుంచి కూడా అవకాశం వెళ్లడం విశేషం. చరణ్ హీరోగా బోయపాటి ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో మరో పవర్ఫుల్ రోల్ ఒకటి ఉందట. ఈ పాత్రకి సుదీప్ అయితే బాగుంటుందని భావించి బోయపాటి ఆయనను సంప్రదించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. సుదీప్ చేయనున్న పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని చెబుతున్నారు. సుదీప్ ఒక వైపున చిరూ సినిమా చేస్తూనే .. మరో వైపున చరణ్ సినిమా చేయనుండటం విశేషం.        

charan
kiara advani
  • Loading...

More Telugu News