shami: వ్యక్తిగత సమస్యల కారణంగానే షమీ బౌలింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడు: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలింగ్‌ కోచ్‌

  • సమస్యల్లో ఉన్నప్పుడు పనిపై పూర్తి దృష్టి పెట్టడం కష్టమే
  • ఉపశమనం పొందాలని షమీ క్రికెట్‌ ఆడుతున్నాడు
  • తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుంది

వ్యక్తిగత సమస్యల కారణంగానే మహమ్మద్ షమీ తన బౌలింగ్‌ రిథమ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలింగ్‌ కోచ్‌ జేమ్స్‌ హోప్స్‌ అన్నారు. టీమిండియా క్రికెటర్‌ మహమ్మద్‌ షమీపై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడుతోన్న షమీ రాణించలేకపోతున్నాడు. తాజాగా షమీ గురించి జేమ్స్‌ మాట్లాడుతూ... ఆయన కొన్ని సమస్యలతో బాధపడుతుండడంతోనే సరిగా బౌలింగ్ వేయలేకపోతున్నాడని తాను భావిస్తున్నానని అన్నారు.

సమస్యల్లో ఉన్నప్పుడు చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టడం ఎవరికైనా కష్టతరమేనని, వాటి నుంచి బయటపడడానికి ఆటగాళ్లు క్రికెట్‌ ఆడుతూ మనసు మళ్లించి కాస్త ఉపశమనం పొందాలని షమీ అదే చేస్తున్నాడని జేమ్స్‌ చెప్పారు. షమీ తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

shami
Cricket
India
  • Loading...

More Telugu News