vishal: విశాల్ ఖరారు చేసేశాడు .. అదే రోజున వచ్చేస్తున్నాడు

  • విశాల్ తాజా చిత్రంగా 'ఇరుంబు తిరై'
  • తెలుగు టైటిల్ గా 'అభిమన్యుడు' 
  • వచ్చేనెల 11వ తేదీన విడుదల    

మాస్ హీరోగా తమిళంలోనే కాదు .. తెలుగులోను విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా తమిళంలో 'ఇరుంబు తిరై' రూపొందింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఆయన భావించాడు. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాకి 'అభిమన్యుడు' అనే టైటిల్ ను ఖరారు చేశాడు.

 అయితే ఇటీవల కోలీవుడ్ చిత్రపరిశ్రమలో జరిగిన సమ్మె కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆగింది. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం కావడంతో, ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా మే 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఆ తరువాత డైలమాలో పడినట్టుగా కనిపించినప్పటికీ, తాజాగా అదే డేట్ ను విశాల్ ఖరారు చేశాడు.    

  • Loading...

More Telugu News