Vijayawada: వందేళ్లు వచ్చేవరకు సినిమాల్లోనే వుంటా.. రాజకీయాల్లోకి మాత్రం రాను: మహేశ్‌ బాబు

  • నాకు వందేళ్లు వచ్చేవరకు సినిమాల్లోనే చేస్తా
  • విజయవాడ రావడం ఆనందంగా ఉంది
  • ఇక్కడిని రావడం సెంటిమెంట్‌గా భావిస్తాను 
  • అభిమానులకు థ్యాంక్స్‌

తనకు వందేళ్లు వచ్చేవరకు సినిమాల్లోనే చేస్తానని, రాజకీయాల్లోకి మాత్రం రానని సినీనటుడు మహేశ్‌ బాబు అన్నారు. కొరటాల శివ, మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'భరత్‌ అనే నేను' సినిమాకి మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిరువురూ ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆ తరువాత అభిమానులతో కలిసి సినిమా చూసి మాట్లాడారు. విజయవాడ రావడం ఆనందంగా ఉందని మహేశ్‌ బాబు అన్నారు. తాను విజయవాడ రావడం సెంటిమెంట్‌గా భావిస్తానని, గతంలో ఒక్కడు, పోకిరీ, దూకుడు వంటి విజయోత్సవ సభలను కూడా విజయవాడలోనే నిర్వహించామని అన్నారు. తన తాజా చిత్రం 'భరత్‌ అనే నేను' చిత్రానికి ఘన విజయం అందించిన అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం విజయవాడలోని డీవీ మానర్‌ హోటల్‌లో చిన్నారులను కలిసిన మహేశ్‌ బాబు వారితో కాసేపు ముచ్చటించారు. ఇటీవల గుండె చికిత్స చేయించుకున్న చిన్న పిల్లలను కలిసి వారితో సెల్ఫీలకు పోజులిచ్చారు.  

Vijayawada
Mahesh Babu
Bharath Ane Nenu
  • Loading...

More Telugu News