kanna babu: చంద్రబాబు నన్ను మోసం చేశారు.. వైసీపీలో చేరుతున్నా: విశాఖ టీడీపీ ఎమ్మెల్యే కన్నబాబు

  • టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డా
  • లోకేష్ కూడా హామీ ఇచ్చి, దగా చేశారు
  • భగవంతుడు చెప్పినా నా నిర్ణయం మారదు

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నానని విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 5వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నానని చెప్పారు. టీడీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... కానీ, తనను పార్టీ చిన్న చూపు చూసిందని అన్నారు. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే తనను నమ్మించి, మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ కూడా తనకు హామీ ఇచ్చి, దగా చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే, తాను టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించానని తెలిపారు. తన నిర్ణయంలో మార్పు ఉండదని, భగవంతుడు చెప్పినా తాను వినబోనని చెప్పారు.

kanna babu
Telugudesam
mla
YSRCP
  • Loading...

More Telugu News