KCR: సికింద్రాబాద్ స్టేషన్ కంటే అక్కడి టాయ్ లెట్లు బాగుంటాయి: కేసీఆర్
- దేశంలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయి
- రాష్ట్రాలకు చెందిన అంశాల్లో కేంద్రానికి ఏం పని
- 29న డీఎంకే, 2న అఖిలేష్ తో చర్చలు
మన దేశంలో మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే న్యూయార్క్ లోని టాయ్ లెట్లు బాగుంటాయని చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలలో కేంద్రానికి ఏం పని? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏటీఎంలలో డబ్బులు దొరక్కపోయినా... మోదీలు మాత్రం దోచుకుని పారిపోతారని విమర్శించారు.
ఈ నెల 29న చెన్నైకి వెళ్లి డీఎంకే నేతలను కలుస్తానని కేసీఆర్ చెప్పారు. మే 2వ తేదీన హైదరాబాదులో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరుపుతామని తెలిపారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రసంగిస్తూ కేసీఆర్ పైవ్యాఖ్యలు చేశారు. అనంతరం 'జై తెలంగాణ.. జై భారత్' అనే నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించారు.