rakhi sawanth: ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపుకు ఉరిశిక్షే సరైంది: రాఖీ సావంత్

  • ఆశారాంకు విధించిన శిక్ష.. రేపిస్టులకు ఒక హెచ్చరిక
  • చిన్నారుల జీవితాలను చిదిమేసేవారిని వదలకూడదు
  • అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వం చెబుతోంది

అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపుకు జీవితఖైదు పడిన సంగతి తెలిసిందే. ఈ శిక్షపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హర్షం వ్యక్తం చేసింది. అయితే చిన్న పిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్షే సరైనదని ఆమె అభిప్రాయపడింది. మైనర్ లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వం చెబుతోందని... ఈ నేపథ్యంలో ఆశారాం బాపుకు ఉరిశిక్షే సరైనదని చెప్పింది. మైనర్ బాలికల జీవితాలను చిదిమేసే వారిని వదలకూడదని తెలిపింది. ఆశారాంకు విధించిన శిక్ష...రేపిస్టులకు ఒక హెచ్చరిక అని చెప్పింది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం... 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడినవారికి ఉరిశిక్ష విధిస్తారు.  

  • Loading...

More Telugu News