Amit Sha: 'గాలి' ఇలాకాలో అమిత్ షా రోడ్ షో రద్దు!

  • బళ్లారిలో రోడ్ షో రద్దు
  • సాయంత్రం కౌపాల్ లో అమిత్ షా పర్యటన
  • కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన రాహుల్ గాంధీ
  • ధర్మస్థల మంజునాథుని దర్శించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు

కన్నడనాట భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేడు బళ్లారి ప్రాంతంలో నిర్వహించతలపెట్టిన రోడ్ షో రద్దయింది. ఈ ప్రాంతంలోని అత్యధిక స్థానాల్లో సీట్లు అక్రమ మైనింగ్ నిందితుడు, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు లభించాయన్న సంగతి తెలిసిందే. అమిత్ షా పర్యటన, రోడ్ షో కోసం బళ్లారి ప్రాంతంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగగా, ఎటువంటి కారణమూ చెప్పకుండానే అమిత్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక ఆయన సాయంత్రం కౌపాల్ ప్రాంతంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళూరులోని టీఎంఏ పాయ్ కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అంతకుముందు దక్షిణ కన్నడ జిల్లాలోని పుణ్యక్షేత్రం ధర్మస్థలకు వెళ్లిన ఆయన, మంజునాథుని దర్శించుకున్నారు. అంతకుముందు అంకోలాలో జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. బన్తవాల్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతుండగా, అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ, అధికారాన్ని నిలుపుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, వీరిద్దరి మధ్యా సత్తా చాటాలని జేడీ(యస్) తమ తమ సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి.

Amit Sha
Rahul Gandhi
Karnataka
BJP
Congress
  • Error fetching data: Network response was not ok

More Telugu News