snapchat: ఈ కళ్లద్దాలుంటే కెమెరా అవసరం లేదు... స్నాప్ చాట్ స్మార్ట్ గాగుల్స్
- ధర 150 డాలర్లు
- ఫొటోలు తీసుకోవడం, వీడియోలు రికార్డు చేసుకోవడం సులభం
- వాటిని స్నాప్ చాట్ అకౌంట్ కు షేర్ చేసుకోవచ్చు
స్నాప్ చాట్ యూజర్లకు సంతోషం కలిగించే వార్త. కెమెరాతో కూడిన కళ్లద్దాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని పేరు ‘స్పెక్టాక్లెస్2.0’. నీటిలో సైతం నిక్షేపంగా పనిచేస్తుంది. చేతులతో ఆపరేట్ చేయాల్సిన ఇబ్బంది ఉండదు. ఫొటోలు తీసుకోవడం, వీడియోలు రికార్డు చేసుకోవడం, వాటిని స్మార్ట్ గా స్నాప్ చాట్ అకౌంట్ కు పంపడం ద్వారా ఇతరులతో షేర్ చేసుకోవడం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఈ కళ్లద్దాల ధర 150 డాలర్లు. స్నాప్ చాట్ లోగడ మొదటి సారి కళ్లద్దాలు తీసుకురాగా, కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో రెండోసారి తగిన మార్పులతో కళ్లద్దాలు తెచ్చింది. మరి ఈ సారైనా విజయం సాధిస్తుందా అన్నది చూడాలి.
చిన్న బటన్ ను ప్రెస్ చేస్తే 10 సెకండ్ల వీడియో రికార్డవుతుంది. మరోసారి ప్రెస్ చేస్తే 30 సెకండ్ల వరకు రికార్డ్ అవుతుంది. బటన్ ను నొక్కి పెట్టి ఉంచితే ఫొటో తీస్తుంది. ఒకసారి రీచార్జ్ చేస్తే 70 వీడియోల వరకు తీసుకోవచ్చు.