kanna lakshmi narayana: కన్నా లక్ష్మీనారాయణతో చర్చలు జరుపుతున్న టీడీపీ!

  • కన్నాతో ఇద్దరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మంతనాలు
  • వైసీపీలో చేరకుండా చూసేందుకు చర్చలు
  • అమిత్ షా మెసేజ్ తో వైసీపీలో కన్నా చేరికకు తాత్కాలిక బ్రేక్

కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి వైసీపీలో చేరేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీలోకి ఆయన వెళ్లకుండా చూసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ మంత్రి, గుంటూరుకు చెందిన మరో మంత్రి, మరి కొందరు గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు కన్నాతో మంతనాలు జరిపారని తెలుస్తోంది.

వాస్తవానికి ఒకానొక దశలో టీడీపీలో చేరేందుకు కన్నా సిద్ధమయ్యారట. అయితే, ఆయనకు సీటు ఇచ్చే విషయంలో పార్టీ అధిష్ఠానం నుంచి సరైన స్పష్టత రాకపోవడంతో... ఆయన వైసీపీకి చేరువయ్యారని చెబుతున్నారు. కోరుకున్న చోట సీటు ఇచ్చేందుకు వైసీపీ ఓకే చెప్పడంతో... ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారట. అయితే జగన్ కు అమిత్ షా మెసేజ్ తో వైసీపీలో కన్నా చేరికకు బ్రేక్ పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో, టీడీపీ నేతలు మరోసారి కన్నాతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. ఏం జరగబోతుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి. 

kanna lakshmi narayana
BJP
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News