Andhra Pradesh: నాలుగేళ్లు నిర్లక్ష్యం చేసిన రాజకీయ పార్టీలు ఇప్పుడు సినీ పరిశ్రమపై నిందలేస్తున్నాయి: నటుడు సుమన్

  • ఢిల్లీ స్థాయిలో ఆందోళనలు జరగాలి
  • మోదీని కలిసి సెంటిమెంట్ తెలియజేయాలి
  • విశాఖలో నటుడు సుమన్

ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో సినీ పరిశ్రమను కలుపుకుని పోకుండా నాలుగేళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన రాజకీయ పార్టీలు, ఇప్పుడు నిందలేస్తున్నాయని ప్రముఖ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, హోదా కోసం ప్రజా పోరాటం అవసరమని, ఢిల్లీ స్థాయిలో ఆందోళనలు జరిగితేనే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిఒక్కరూ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్ గురించి తెలియజేయాలని అన్నారు. హోదాపై జరుగుతున్న పోరులో నటీనటులు స్పందించలేదని అనడం సరికాదని పేర్కొన్నారు.

Andhra Pradesh
Special Category Status
Suman
Tollywood
  • Loading...

More Telugu News