Pawan Kalyan: ద్వేషంతో ఊగిపోతున్న వాళ్లు ఫ్యాన్సా?.. పవన్ అభిమానులపై ప్రముఖ సాంకేతిక నిపుణుడు నల్లమోతు శ్రీధర్ ఫైర్

  • పవన్ అభిమానులు దిగజారి ప్రవర్తిస్తున్నారు
  • ట్వీట్లు చేస్తూ కూర్చోవడం వల్ల పైసా ప్రయోజనం ఉండదు
  • ఉద్దానం తర్వాత ఏ విషయంలో స్పందించారో చెప్పాలి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులపైనా, పవన్‌పైనా ప్రముఖ సాంకేతిక నిపుణుడు నల్లమోతు శ్రీధర్ పైరయ్యారు. ప్రశ్నిస్తున్నామన్న పేరుతో ద్వేషభావాన్ని పెంపొందించేవారు అభిమానులు కాబోరన్నారు. పవన్ అభిమానులు మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని అన్నారు. నాయకుడు ఎవరినైనా తిడితే దానిని మోసుకు తిరిగే వారు.. కాస్తంత సమాజంపైనా దృష్టి పెడితే బాగుంటుందని శ్రీధర్ సూచించారు.
 
శ్రీకాకుళంలోని ఉద్దానం వంటి ఒకటి రెండు సమస్యల గురించి తప్ప పవన్ ఇంక దేని గురించి పట్టించుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కానని పేర్కొన్న శ్రీధర్.. ఓ సామాన్య పౌరుడిగా ఇది తన ఆవేదన అని అన్నారు. ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేసుకుంటూ పోవడం వల్ల పైసా కూడా ప్రయోజనం ఉండదని విమర్శించారు. ఓట్లు కావాలనుకున్న వ్యక్తి తొలుత ప్రజలకు ఏదైనా చేసి మాట్లాడాలి తప్పితే ఇలా అభిమానులను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని పవన్‌ ఉద్దేశించి శ్రీధర్ పేర్కొన్నారు.

Pawan Kalyan
Jana sena
Nallmothu sridhar
  • Loading...

More Telugu News