Asaram bapu: నాలాంటి బ్రహ్మజ్ఞానులు బాలికలను రేప్ చేయొచ్చు: ఆశారాం బాపు

  • లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఔషధాలు
  • అమ్మాయిలను తెచ్చిపెట్టేందుకు ముగ్గురు యువతులు
  • ప్రశ్నించినందుకు నన్ను గెంటివేశారు: సచార్

పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఆశారాం బాపు బాలికలపై అత్యాచారం చేయడాన్ని గొప్పగా భావించేవాడట. అంతేకాదు.. తన లాంటి బ్రహ్మజ్ఞానులు అలా చేయడం తప్పేమీ కాదని సమర్థించుకునేవాడట. బాలికపై అత్యాచారం కేసు కోర్టు విచారణ సమయంలో ఆయన అనుచరుడు రాహుల్ కె.సచార్ కోర్టుకు ఈ విషయాలు తెలిపాడు. లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆశారాం ఔషధాలు కూడా వాడేవాడని చెప్పారు. రాజస్థాన్ లోని పుష్కర్, హరియాణాలోని భివానీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్ కుటీరాల్లో బాలికలపై ఆశారాం అత్యాచారాలు చేస్తుండగా తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన వివరించారు.  

ఆశ్రమంలోని ముగ్గురు యువతులు ఆశారాంకు బాలికలను తీసుకొచ్చి అప్పగించేవారని, ఒకసారి ఆయన బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా తాను చూశానని, ఈ విషయాన్ని లేఖ ద్వారా అతడిని ప్రశ్నించానని సచార్ తెలిపారు. ఆ లేఖను చదివి చింపి పారేశారని, తర్వాత మరో లేఖ రాసినా సమాధానం రాలేదని పేర్కొన్నారు. దీంతో స్వయంగా వెళ్లి ‘ఇదేం పని?’ అని గట్టిగా ప్రశ్నిస్తే.. ‘‘నాలాంటి బ్రహ్మజ్ఞానులు బాలికలను బలాత్కరించడం తప్పుకాదు’’ అని తీరిగ్గా చెప్పారని పేర్కొన్నారు. ‘‘మరి బ్రహ్మజ్ఞానులకు కోరికలేంటి?’’ అని ప్రశ్నిస్తే గార్డులతో తనను గెంటి వేయించారని పేర్కొన్నారు. భక్తులకు ఉన్నతమైన బోధలు చేసే అతడు మాత్రం వాటినెప్పుడూ పాటించలేదని సచార్ కోర్టుకు తెలిపాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News