sri reddy: నాకు బెదిరింపులొస్తున్నాయనడానికి ఇవే నిదర్శనం: నటి శ్రీరెడ్డి

  • ఈరోజు నా ఫోన్ కాల్స్ జాబితాలో నెంబర్లన్నీ నాకు తెలియనివే
  • ఈ శిక్ష నేను భరించలేను.. దయచేసి దయతో వ్యవహరించండి
  • ప్రతి ఫోన్ నెంబర్ ను పోలీసులకు అందజేస్తా

తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా తాను గళం విప్పి, పోరాటం చేస్తున్నప్పటి నుంచి తనకు పలు బెదిరింపులు వస్తున్నాయంటూ నటి శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఒంటరి మహిళగా జీవిస్తున్న తనపై అత్యాచారం చేస్తామని, హతమారుస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని వాపోయిన శ్రీరెడ్డి, అందుకు ఇవే నిదర్శనమంటూ తాజాగా పోస్ట్ లు చేసింది. 

ఈరోజు తనకు వచ్చిన ఫోన్ కాల్స్ జాబితాను పరిశీలిస్తే, ఆ నెంబర్లన్నీ తనకు తెలియనివేనని పేర్కొంది. ‘ఈ శిక్షను నేను భరించలేను.. దయచేసి దయతో వ్యవహరించండి..ఇంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? ప్రతి ఫోన్ నెంబర్ ను పోలీసులకు అందజేస్తా’ అని హెచ్చరించిన శ్రీరెడ్డి, ఆ కాల్ లిస్ట్ ను పొందుపరిచింది. మరో పోస్ట్ లో.. సుమారు ఒక వారం రోజుల నుంచి పురుగులు పట్టిన రవ్వతో భోజనం చేయిస్తున్న మహానుభావుల్ని జీవితంలో మర్చిపోలేనని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.



sri reddy
threat
  • Error fetching data: Network response was not ok

More Telugu News