Nara Lokesh: క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి ధర్నా చేస్తే నాకు సంబంధం ఏంటి?: నారా లోకేశ్‌

  • పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేశ్
  • పవన్ నాపై ఆరోపణలు చేస్తున్నారు
  • ఆధారాలు ఉంటే బయట పెట్టాలని ట్విట్టర్‌లో కోరాను

యువనటి శ్రీరెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పదే పదే చూపిస్తూ డిబేట్లు నిర్వహించిన పలు టీవీ ఛానెళ్లపై మండిపడుతోన్న సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై నారా లోకేశ్ తాజాగా స్పందించారు. ఈ రోజు ఆయన విజయనగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ... పవన్ తనపై ఆరోపణలు చేస్తున్నారని, శ్రీరెడ్డి విషయంలో విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

తనపై పవన్ చేస్తోన్న ఆరోపణల్లో ఆధారాలు ఉంటే బయట పెట్టాలని తాను ఇప్పటికే ట్విట్టర్‌లో కోరానని నారా లోకేశ్‌ చెప్పారు. తాను ఎనిమిదేళ్ల నుంచి తన ఆస్తులు ప్రకటిస్తున్నానని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్‌ విధానంపై శ్రీరెడ్డి ధర్నా చేస్తే తనకు సంబంధం ఏంటని లోకేశ్ ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై తనకు అవగాహన లేదని, వ్యక్తిగతంగా పవన్ అంటే తనకు ఎప్పుడూ గౌరవమే ఉంటుందని వ్యాఖ్యానించారు.

Nara Lokesh
sri reddy
Pawan Kalyan
  • Loading...

More Telugu News