bcci: తదుపరి ఐపీఎల్ ఏ దేశంలో?.. అన్న విషయంపై బీసీసీఐ ప్రకటన

  • వచ్చే ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు
  • యూఏఈలో ఐపీఎల్‌ జరిగే అవకాశం
  • 2019లో మార్చి 29 నుంచి మే 19 వరకు మ్యాచులు

వచ్చే ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి ఐపీఎల్‌ మ్యాచులు ఎక్కడ నిర్వహిస్తామన్న విషయంపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్ మ్యాచులను మార్చి 29 నుంచి మే 19 వరకు యూఏఈలో నిర్వహిస్తామని పేర్కొంది. అయితే, ఈ విషయంపై పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని, ఎన్నికల షెడ్యూల్‌ ఆధారంగా ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లు మాత్రమే అక్కడ జరిగే అవకాశం ఉందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. మరోవైపు తదుపరి ఐపీఎల్‌ సౌతాఫ్రికాలో నిర్వహిస్తే బాగుంటుందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2009లో ఐపీఎల్ 2వ సీజన్‌ను సౌతాఫ్రికాలో నిర్వహించారు. 

bcci
Cricket
India
uae
  • Loading...

More Telugu News