modi: మోదీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం!: టీడీపీ ఎంపీ కొనకళ్ల
- థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసైనా సరే మళ్లీ మోదీని రానీయం
- విభజన హామీలను కేంద్రం అమలు చేసి తీరాల్సిందే
- కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు మా పోరాటం ఆగదు
- జగన్ దొంగ పాదయాత్రలు చేస్తున్నారు
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసైనా సరే, వచ్చే ఎన్నికల్లో మోదీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరాల్సిందేనని, ఈ విషయంలో కేంద్రం దిగొచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీతో జతకట్టిన జగన్, దొంగ పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు, వైసీపీ తమకు ప్రత్యర్థే కాదని, మచిలీపట్నం పోర్టును వ్యతిరేకిస్తున్న జగన్ కు కృష్ణా జిల్లాలో పర్యటించే అర్హత లేదని విమర్శించారు.