Mahesh Babu: అమెరికాలో 'భరత్ అనే నేను' వసూళ్ల రికార్డ్

  • భారీ విజయాన్ని నమోదు చేసిన 'భరత్'
  • రెండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ 
  • 150 కోట్ల దిశగా పరుగులు

అందరూ అనుకున్నట్టుగానే కొరటాల.. మహేశ్ ల క్రేజీ కాంబినేషన్ కి 'భరత్ అనే నేను'తో మరో హిట్ పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా అమెరికాలోను భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. వారం రోజుల్లో ఈ సినిమా అక్కడ 17 కోట్లు (2.6 మిలియన్లు) రాబట్టింది.

'బాహుబలి'ని ఒక ప్రత్యేక చిత్రంగా భావించి పక్కన పెడితే, అక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించిందని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలోను ఈ సినిమా 2.6 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ను సాధించగా, ప్రస్తుతం 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోందని చెబుతున్నారు.    

  • Loading...

More Telugu News