laxmi narayana: ఇక విస్తృతంగా ప్రజల్లోకి వెళతా.. నా ప్రణాళిక వెల్లడిస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
- ప్రజా సమస్యలు తెలుసుకుంటాను
- ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరం
- హోదాతో కంపెనీలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం
- ఏ రాజకీయ పార్టీలోనూ చేరను
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి వస్తారంటూ ఊహాగానాలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవికి రాజీనామా చేయగా నిన్న దాన్ని ఆమోదించారు. స్వచ్ఛంద పదవీ విరమణ ఆమోదం పొందిన తరువాత లక్ష్మీ నారాయణ తొలిసారి గుంటూరులో మీడియా ముందుకు వచ్చారు. తాను తొలుత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ప్రజా సమస్యలు తెలుసుకున్నాక, తన ప్రణాళిక తెలుపుతానని అన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమని, హోదాతో కంపెనీలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. కాగా, తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని ఆయన తేల్చి చెప్పారు.