paruchuri gopalakrishna: కొరటాల గొప్పతనం అదే: పరుచూరి గోపాలకృష్ణ
- కొరటాల ఆలోచనా విధానం నచ్చింది
- ఎంతో నిజాయతీతో ఈ సినిమా చేశాడు
- జాతర సందర్భంలో మరొకరైతే ఐటమ్ పెట్టేవారు
'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో గోపాలకృష్ణ 'భరత్ అనే నేను' సినిమాను గురించి ప్రస్తావించారు. ఈ సినిమాలోని కొన్ని విశేషాలను గురించి ముచ్చటిస్తూనే, కొరటాల ఆలోచనా విధానాన్ని అభినందించారు. 'భరత్ అనే నేను' సినిమాను చూస్తే ఆయన ఆ సినిమాను కమర్షియల్ గా తీయలేదని అర్థమవుతుంది. అందుకు ఉదాహరణగా, ఈ సినిమాలో 'జాతర' సందర్భం గురించి చెప్పుకోవాలి'.
'సాధారణంగా 'జాతర' సందర్భం వస్తే కొంతమంది దర్శకులు హమ్మయ్య ఛాన్స్ దొరికేసిందని ఐటమ్ సాంగ్ పెట్టేస్తారు. నిజంగానే అక్కడ ఓ ఐటమ్ సాంగ్ తో అదరగొట్టెయ్యొచ్చు. కానీ కొరటాల అలా చేయలేదు .. ఆడియన్స్ మూడ్ ను ఆయన డిస్టర్బ్ చేయలేదు .. అదే కరెక్ట్. నేను పక్కనే వున్న మా అమ్మాయికి కూడా అదే చెప్పాను. నిజంగా ఎంతో నిజాయితీగా కొరటాల ఈ సినిమా తీశాడని చెప్పొచ్చు.