Ganta Srinivasa Rao: పవన్ కు రాజకీయ పరిణతి లేదు!: గంటా శ్రీనివాసరావు విమర్శలు

  • జగన్, పవన్ లు మోదీని ఒక్క మాట కూడా అనడం లేదు
  • టీడీపీని బలహీనపరచేందుకు వీరు కుట్ర పన్నారు  
  • చంద్రబాబు కల నెరవేరాలని వెంకన్నకు మొక్కుకున్నా

రాజకీయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా పరిణతి చెందలేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఎంత మాత్రం నిలకడ కూడా లేదని అన్నారు. పవన్, జగన్ ఇద్దరూ కలసి తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేందుకు కుట్ర పన్నారని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని జగన్, పవన్ లు ఒక్క మాట కూడా అనడం లేదని... కాని రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని గంటా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 30న నిర్వహించనున్న తిరుపతి బహిరంగసభ విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. ఏపీని నెంబర్ వన్ చేయాలనే చంద్రబాబు కల నెరవేరాలని వేడుకున్నానని తెలిపారు. 

Ganta Srinivasa Rao
Chandrababu
Pawan Kalyan
Jagan
  • Loading...

More Telugu News