jagan: కృష్ణా జిల్లా నందమూరులో ముగిసిన జగన్ పాదయాత్ర.. హైదరాబాదుకు పయనం

  • ఉదయం 10 గంటలకు ముగిసిన పాదయాత్ర
  • రేపు కోర్టుకు హాజరుకానున్న జగన్
  • శనివారం పెనమలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న పాదయాత్ర

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వెంకటరామపురంలో ఈ ఉదయం ప్రారంభమైన వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర... నందమూరు గ్రామంలో ముగిసింది. ఉదయం 10 గంటలకే పాదయాత్రను జగన్ ముగించారు. అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి, విమానంలో హైదరాబాదుకు బయల్దేరారు. శుక్రవారంనాడు కోర్టు విచారణకు హాజరు కావలసిన నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ పడింది. రేపు సాయంత్రం ఆయన మళ్లీ నందమూరు చేరుకుంటారు. శనివారం ఉదయం పెనమలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించి, పాదయాత్రను కొనసాగిస్తారు.

మరోవైపు టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఇందుపల్లి గ్రామంలో జగన్ పాదయాత్ర జరగనుందని తెలియడంతో.... నిన్న మధ్యాహ్నం నుంచే గ్రామమంతా టీడీపీ జెండాలు, బ్యానర్లతో నింపేశారు. అయితే, గొడవలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు నిన్న అర్ధరాత్రి పలువురు నేతలను అరెస్ట్ చేశారు. అంతేకాక గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే, గ్రామంలో పాదయాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  

jagan
padayatra
court
  • Loading...

More Telugu News