anam vivekananda reddy: ప్రజల కోసం మంత్రి పదవినే వద్దనుకున్న నేత ఆయన: చంద్రబాబు

  • వివేకానందరెడ్డి గొప్ప నాయకుడు
  • ఆయన లేని లోటు పూడ్చలేనిది
  • ఆనం కుటుంబానికి విశిష్టమైన గుర్తింపు ఉంది

దివంగత ఆనం వివేకానందరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతోనే కలిసి ఉండాలనే తపనతో... మంత్రి పదవిని సైతం వద్దనుకున్న గొప్ప నేత వివేక అని అన్నారు. ఆయన లేని లోటును పూడ్చలేమని, ఒక గొప్ప నేతను కోల్పోయామని చెప్పారు. ఆనం కుటుంబానికి విశిష్టమైనటువంటి రాజకీయ గుర్తింపు ఉందని కొనియాడారు. కాసేపటి క్రితం వివేక మృతదేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. 

anam vivekananda reddy
Chandrababu
  • Loading...

More Telugu News