karnataka elections: అటు నుంచి 40, ఇటు నుంచి 40 మంది... కర్ణాటకలో హోరాహోరీ ప్రచారం
- కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, సచిన్ పైలట్, థరూర్
- బీజేపీ నుంచి యోగి, గడ్కరీ, ఫడ్నవిస్
- ఒకరిపై మరొకరు విమర్శలు
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం ప్రచార హోరును పెంచుతోంది. అధికార కాంగ్రెస్ మరోసారి గెలుపు కోసం 40 మంది స్టార్ ప్రచారకులను రంగంలోకి దింపగా, అటు బీజేపీ కూడా ఏమీ తగ్గకుండా అంతే మంది చేయి తిరిగిన ప్రచారకులను మోహరించింది. దీనిపై ఇరు పార్టీలు విమర్శలు కూడా చేసుకున్నాయి.
మోదీ, షా కలయిక సరిపోదని, ఆ పార్టీ మరింత మంది ప్రముఖులను ప్రచారానికి దింపిందని కాంగ్రెస్ విమర్శించింది. అయితే, కాంగ్రెస్ ప్రదర్శన తమ ముందు నిలవలేదని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సచిన్ పైలట్, శశి థరూర్, మొహ్మద్ అజారుద్దీన్, రాజ్ బబ్బర్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ఉండగా, బీజేపీ నుంచి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, శివ్ రాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ప్రచార బాధ్యతల్ని తలకెత్తుకున్నారు.