metro: నాలుగు మెట్రో సిటీల్లో ట్రాఫిక్ రద్దీ వల్ల రూ.1.5 లక్షల కోట్ల ఆర్థిక భారం

  • కోల్ కతాలో భారీ రద్దీ
  • ఆ తర్వాత బెంగళూరులో
  • ఢిల్లీ పరిస్థితి కాస్త నయం
  • బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అధ్యయనంలో వెల్లడి

నగరాల్లో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా విలువైన ప్రజాధనం ఆవిరైపోతోంది. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్ కతాలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఏటా రూ.1.47 లక్షల కోట్ల మేర ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని అంతర్జాతీయంగా పేరొందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అధ్యయనం వెల్లడించింది. ట్రాఫిక్ చాలా రద్దీ ఉండే ఉదయం 7-9 గంటలు, సాయంత్రం 6-8 గంటల మధ్య జనవరిలో ఈ సర్వే నిర్వహించింది. ఈ పీక్ సమయంలో వాహనదారులు ఒక చోట నుంచి మరో చోటకు చేరుకునేందుకు, రద్దీలేని సమయంతో పోలిస్తే రెట్టింపున్నర మేర అధిక సమయం తీసుకుంటుందని తెలిసింది.

ఈ నాలుగు నగరాల్లో కోల్ కతాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ తర్వాత ట్రాఫిక్ రద్దీ బెంగళూరులోనే అధికం. దేశ రాజధానిలో పరిస్థితి కాస్త ఫర్వాలేదు. ఇక్కడ మొత్తం స్థలంలో 12 శాతం రహదారులే ఉండడం వల్ల రద్దీ కాస్త నయంగా ఉండడానికి కారణం. అదే కోల్ కతా నగర విస్తీర్ణంలో రోడ్ నెట్ వర్క్ స్థలం 6 శాతంగానే ఉంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఎక్కువగా ముంబైలో వినియోగించుకుంటున్నారు. ఆ తర్వాత కోల్ కతా ఉంది.

  • Loading...

More Telugu News