kanna: వైసీపీలో చేరిక ఖాయమే: కన్నా శిష్యుడు అడపా

  • మా నాయకుడి అనారోగ్యం కారణంతోనే చేరిక ఆలస్యం
  • 1000 కార్లతో వెళ్లి సత్తా చాటుతాం
  • మీడియాతో అడపా శివనాగేంద్ర

తమ నాయకుడు అనారోగ్యం బారిన పడటంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఆలస్యం అయిందని కన్నా లక్ష్మీనారాయణ అనుంగు శిష్యుడు అడపా శివనాగేంద్ర వెల్లడించారు. కన్నాతో పాటే తాను కూడా వైసీపీలో చేరబోతున్నానని, ఇది ఖాయమని తెలిపారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, బుధవారమే జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని, అదే సమయంలో కన్నా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. బీజేపీకి రాజీనామా చేసిన తరువాత మాత్రమే వైసీపీలో చేరతామని, జగన్ తో మాట్లాడి మరో తేదీని ఖరారు చేసుకుంటామని అన్నారు. తాము వైసీపీలో చేరే రోజున దాదాపు 1000 కార్లతో ర్యాలీగా వెళ్లి సత్తా చాటాలని నిర్ణయించినట్టు చెప్పారు.

kanna
YSRCP
Adapa Siva Nagendra
BJP
  • Loading...

More Telugu News