Kodali Nani: కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చిన వల్లభనేని వంశీ!

  • నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి
  • పిచ్చి కుక్కలా మాట్లాడితే సహించం
  • నానిలాంటి వాళ్లను జగన్ కంట్రోల్ చేయాలి

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి టీడీపీ ఎమ్మల్యే వల్లభనేని వంశీ వార్నింగ్ ఇచ్చారు. జగన్ పాదయాత్ర సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ తనను సన్నిహిత మిత్రుడిగా చెప్పారని... ఇదే సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని... ఆయన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

కొడాలి నాని పిచ్చి కుక్కలా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. నాని ఒకప్పుడు తనకు స్నేహితుడని, ఇప్పుడు కాదని తెలిపారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కొడాలి నానితో పాటు బరితెగించి మాట్లాడుతున్న ఇతర నేతలను జగన్ కంట్రోల్ చేయాలని... లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 

Kodali Nani
Vallabhaneni Vamsi
Chandrababu
Jagan
  • Loading...

More Telugu News