Sri Reddy: మౌనంగా ఉన్నా... సముద్రాన్ని కబళించే రోజు దగ్గర్లోనే..!: నటి శ్రీరెడ్డి లేటెస్ట్ కామెంట్

  • క్యాస్టింగ్ కౌచ్ పై నిరసన తెలుపుతున్న శ్రీరెడ్డి
  • ఒంటిపై వేడివేడి వాతలను భరిస్తున్నా
  • కలుపు మొక్కల ఎదుగుదలను చూస్తున్నా
  • ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి పోస్టు

ప్రస్తుతం తాను మౌనంగా ఉన్నానని, అయితే సముద్రాన్ని కబళించే రోజు దగ్గర్లోనే ఉందని టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై వినూత్న రీతిలో నిరసన తెలిపి, మహిళా సంఘాల మద్దతు కూడగట్టి, ఉద్యమాన్ని లేవదీసి, సినీ ఇండస్ట్రీని కదిలించిన నటి శ్రీరెడ్డి తాజాగా వ్యాఖ్యానించింది.

ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, "వింటున్నా ప్రతి సుత్తి దెబ్బనీ, చూస్తున్నా ప్రతి కలుపు మొక్క ఎదుగుదలనీ, భరిస్తున్నా నా వంటిపై పడుతున్న వేడివేడిగా కాల్చిన వాతలని, నా మౌనం సముద్రాన్ని కదిలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి" అని వ్యాఖ్యానించింది.

అంతకుముందు ఓ కవితను పోస్టు చేస్తూ, జీవితం ఓడించిన ప్రతిసారీ ఓ పక్షిలా రెక్కలు విప్పుకోవాలని ఉంటుందని, భూమిని చీల్చుకునే విత్తులా తలెత్తాలని ఉందని చెప్పింది.

Sri Reddy
Casting Couch
Tollywood
Facebook
  • Loading...

More Telugu News