shami: కథువా బాలిక చనిపోయింది, నేను బతికున్నా... అంతే తేడా!: క్రికెటర్ షమీ భార్య షాకింగ్ కామెంట్స్

  • హత్యాచార ఘటనతో పోలిక
  • రేప్ చేయాలని చూశారని ఆరోపణ
  • ఆపై చంపాలని చూస్తే తప్పించుకున్నానని వెల్లడి

తన భర్తకు, తనకూ మధ్య ఉన్న విభేదాలను కథువా హత్యాచార ఘటనతో పోల్చిన క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సంచలన కామెంట్లు చేసింది. తాను కూడా కథువా బాధితురాలి మాదిరిగానే లైంగిక వేధింపులు అనుభవించానని, ఆ ఘటనలో ఏం జరిగిందో తన జీవితంలోనూ దాదాపు అదే జరిగిందని చెప్పింది.

తనను రేప్ చేయాలని షమీ కుటుంబీకులు ప్రయత్నించారని, ఆపై చంపేసి చెత్తకుప్పలో మృతదేహాన్ని పడేయాలని చూశారని, రెండు నెలల పాటు షమీ ఇంట్లో పోరాడి ప్రాణాలతో బతికానని జహాన్ మీడియా ముందు వ్యాఖ్యానించింది. కథువా బాధితురాలి కోసం ఓ ఎన్టీవో సంస్థ ర్యాలీని నిర్వహించగా జహాన్ పాల్గొంది. కాగా, ఇటీవలి కాలంలో తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసిన జహాన్, ఆయనతో పాటు, అత్త, మరిది తదితరులపైనా గృహ హింస కింద కేసులు పెట్టిన సంగతి తెలిసిందే.

shami
Haseen Jahaan
Kathuva
Rape
Murder
  • Loading...

More Telugu News