susheel kumar shindey: చంద్రబాబు పోరాటం న్యాయబద్ధమైంది.. బీజేపీ ఇలా ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదు: సుశీల్ కుమార్ షిండే

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది
  • మోదీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
  • కర్ణాటకలో కాంగ్రెస్ దే గెలుపు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఏపీకి కావాల్సిన అన్ని వసతులు కల్పించాలని చట్టంలో పేర్కొన్నామని... వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కానీ, బీజేపీ ఇలా ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని చెప్పారు.

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి, అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ ఒక్కటి కూడా అమలు చేయలేదని... ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈమేరకు స్పందించారు.

susheel kumar shindey
special status
Chandrababu
  • Loading...

More Telugu News