keerthi suresh: 'మహానటి' ఆడియో ఫంక్షన్ కి రంగం సిద్ధం

- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి'
- ప్రధాన పాత్రలో కీర్తి సురేశ్
- 1వ తేదీన ఆడియో రిలీజ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' చిత్రం రూపొందింది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, మే 1వ తేదీన ఆడియో ఫంక్షన్ ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలోని నటీనటులంతా కూడా ఈ పాటల వేడుకకి హాజరుకానున్నారు. ఆడియో వేడుక ఎప్పుడు ఎక్కడ జరపనున్నది ప్రకటించనున్నారు.
