RCB: భారీ స్కోర్ చేసినా ఓడిపోయాం.. బౌలర్లపై విరుచుకుపడ్డ కోహ్లీ!

  • గత రాత్రి మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్సీబీ
  • భారీ స్కోరు చేసినా చెన్నై చేతిలో పరాజయం
  • తప్పు బౌలర్లదేనని వ్యాఖ్యానించిన కోహ్లీ

బ్యాట్స్ మెన్లు రాణించి 205 పరుగుల కష్టసాధ్యమైన స్కోరును నమోదు చేసిన తరువాత, 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రత్యర్థిని మరింతగా దెబ్బతీయాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మ్యాచ్ ని చేజార్చుకున్నామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి తరువాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

భారీ స్కోరు చేసినా ఓడిపోయామని, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం అయ్యారని మండిపడ్డాడు. ఈ విధమైన బౌలింగ్ ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, చివరి ఓవర్లలో అన్నేసి పరుగులు ఇవ్వడం ఆటలో పెద్ద నేరమని అన్నాడు. చెన్నై ఆటగాళ్లకు భారీ స్కోరును ఛేదించే అవకాశాన్ని తమ జట్టు బౌలర్లు ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు. తదుపరి మ్యాచ్ లలో తప్పులను సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నానని, ధోనీ తన అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడని అన్నాడు.

RCB
Chennai Superkings
IPL
Virat Kohli
MS Dhoni
  • Loading...

More Telugu News